For Money

Business News

నేడు జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ: చేనేతకు ఊరట?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం ఇవాళ ఢిల్లీలో జరుగనుంది. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రులు పంకజ్‌ చౌదరి, డాక్టర్‌ భగవత్‌ కిషన్‌ రావు కరద్‌ కూడా ఈ సమావేశానికి హాజరుకాన్నారు. చేనేత వస్త్రాలతో పాటు రూ.1000 లోపు పాదరక్షలపై జీఎస్టీ వ్యవహారంపై ఇవాళ చర్చ జరుగనుంది. కౌన్సిల్‌లో చర్చించకుండా అధికారుల కమిటీలు ఇచ్చే నివేదికలను ఆమోదించడాన్ని తాము అంగీకరించమని తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగరాజన్‌ స్పష్టం చేశారు. చేనేతపై జీఎస్టీ పెంచాలన్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయనతో పాటు ఇతర రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒకవైపు బంగ్లాదేశ్‌ టెక్స్‌టైల్‌ రంగంలో దూసుకుపోతుంటే… మన పరిశ్రమను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇలా చావుదెబ్బ తీయడం మంచిది కాదని రాజస్థాన్‌ అంటోంది. ముఖ్యంగా బీజేపీయేతర పార్టీలు ఈ సమావేశంలో చాలా గట్టిగా వాదించనున్నాయి. త్వరలోనే రాష్ట్రాల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కేంద్రం జీఎస్టీ తాజా ప్రతిపాదనలపై వెనక్కి తగ్గే అవకాశాలు అధికంగా ఉన్నాయి.