For Money

Business News

స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి

ఇవాళ్టి నుంచి జనవరి డెరివేటివ్స్‌ ప్రారంభం కానున్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. నష్టాలు నామమాత్రంగానే ఉన్నాయి. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.3 శాతం నష్టపోయింది. డాలర్‌తోపాటు క్రూడ్‌ కూడా స్థిరంగా ఉన్నాయి. కొత్త ఏడాది సందర్భంగా అనేక మార్కెట్లకు సెలవు కాగా, పనిచేస్తున్న ఎక్స్ఛేంజీలు కూడా నామమాత్రపు టర్నోవర్‌తో నడుస్తున్నాయి. జపాన్‌కు సెలవు. చైనా మార్కెట్లు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. హాంగ్‌సెంగ్ ఒకటిన్నర శాతం లాభాల్లో ఉంది. సింగపూర్ నిఫ్టి స్వల్ప నష్టంతో ఉంది. నిఫ్టి స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.