For Money

Business News

NIFTY TODAY: పెరిగితే అమ్మండి

పెరిగినపుడు అమ్మినా స్వల్ప లాభాలే రావొచ్చు. జవనరి డెరివేటివ్స్‌ ప్రారంభ రోజు కావడంతో పలు కాంట్రాక్ట్‌ల ప్రీమియం తగ్గే అవకాశముంది. సాధారణంగా గత నెల, ఈ నెల మధ్య ప్రీమియంలో తేడా ఉంది. మరీ ఎక్కువ ఉంటే ఆరంభంలో కరిగే అవకాశముంది. అలాగే దిగువస్థాయిలో నిఫ్టి బై సిగ్నల్‌ ఉన్నా… నిఫ్టి ఇప్పటికే ఓవర్ బాట్‌ పొజిషన్‌లోఉంది. ఈ నేపథ్యంలో నిఫ్టి పెరిగితే అమ్మకాల ఒత్తిడి వస్తుంది. పడినా వెంటనే మద్దతు కూడా లభించవచ్చు. నిఫ్టి క్రితం ముగింపు 17,204. నిఫ్టికి ఇదే కీలక స్థాయి. ఇక్కడి నుంచి పెరిగితే 50-60 పాయింట్లకే అమ్మకాల ఒత్తిడి వస్తుంది. రిస్క్‌ తీసుకునేవారు 17275 స్టాప్‌లాస్‌తో అమ్మొచ్చు. మరి ఈ అవకాశం ఓపెనింగ్‌లోనే వస్తుందా లేదా తరవాత వస్తుందా అనేది చెప్పలేం. ఎందుకంటే నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభం కానుంది. ఒకవేళ నష్టంతో ప్రారంభమైతే నిఫ్టికి 17150 లేదా 17130 ప్రాంతంలో మద్దతు లభించవచ్చు. ఇవాళ్టికి ఆల్గో లెవల్‌ 17155-17255. మరో లెవల్‌ 17122-17266. వీటి మధ్యే నిఫ్టి కదలాడే అవకాశముంది. జీఎస్టీకి సంబంధించి కీలక నిర్ణయం కౌన్సిల్‌ తీసుకోవచ్చు. ఇటీవల బాగా పడిన టెక్స్‌టైల్‌, ఫుట్‌వేర్‌ కంపెనీల షేర్లకు మద్దతు లభించవచ్చు.