For Money

Business News

17300పైన ప్రారంభమైన నిఫ్టి

జవనరి డెరివేటివ్స్‌ ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టి ఓపెనింగ్‌లో 17,238ని తాకి…వెంటనే 17316కి చేరింది. ప్రస్తుతం 92 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి ఇక్కడి నుంచి 17,322 స్టాప్‌లాస్‌తో అమ్మొచ్చు. కాని ఇది నిఫ్టికి గ్రీన్‌ జోన్‌. ఈ స్థాయిని దాటితే అమ్మొద్దు. నిఫ్టి 17300పైన నిఫ్టి జోలికి వెళ్ళకపోవడం మంచిది. గత కొన్ని రోజులుగా బలహీనంగా ఉన్న ప్రైవేట్‌ బ్యాంకు షేర్లు ఇవాళ పెరిగాయి. అలాగే మెటల్స్‌ కూడా. నిఫ్టి పెరగడానికి పెద్ద కారణాలు లేవు. స్టాప్‌లాస్‌తో అమ్మి వెయిట్‌ చేయడం తప్ప. షార్ట్‌ సెల్లర్స్‌కు యూరో మార్కెట్ల సమయంలో మంచి అవకాశం లభించవచ్చు. అమెరికా ఫ్యూచర్స్‌తో పాటు యూరో ఫ్యూచర్స్‌ కూడా డల్‌గా ఉండటమే దీనికి కారణం. మిడ్‌ క్యాప్స్‌లో ఐడియా ఇవాళ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. బ్యాంక్‌ నిఫ్టి చాలా రోజుల తరవాత నిఫ్టికి అండగా నిలిచింది. మరి ఎంత వరకు సాగుతుందో చూడాలి.