For Money

Business News

చేనేతపై జీఎస్టీ ట్యాక్స్‌ పెంపు వాయిదా

టెక్స్‌టైల్స్‌పై జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచాలన్న నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సిల్‌ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇవాళ జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌లో ఈ పెంపుదలను అనేక రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. విదేశాలలో ఇతర దేశాల ఉత్పత్తులతో పోటీ పడాలంటే జీఎస్టీ ప్రతిబంధకంగా మారుతుందని పారిశ్రామిక వర్గాలు అంటున్నారు. అలాగే పాలిస్టర్‌ దుస్తులత పోటీ పడలేకపోతున్న చేనేత పరిశ్రమ తాజా నిర్ణయం వల్ల మరింత కుదేలౌతుందని పలు రాష్ట్రాలు వాదించాయి. దీంతో టెక్స్‌టైల్స్‌పై ఇపుడున్న జీఎస్టీనే వసూలు చేయాలని, ప్రస్తుత ప్రతిపాదన అమలు వాయిదా వేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సాయంత్రంలోగా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశముంది.