For Money

Business News

BPCL: పాక్షిక వాటా విక్రయం

ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన భారత్‌ పెట్రోలియం కార్పొరేషణ్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) ప్రైవేటీకరణ విఫలమైంది. ప్రభుత్వం ప్రకటించిన ఫార్మాట్‌ ఈ కంపెనీని ఎవరూ కొనుగోలు చేయరని వేదాంత గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ బాహాటంగా ప్రకటించారు. దీంతో బీపీసీఎల్‌ను పూర్తి అమ్మడం కంటే… పాక్షికంగా కొంత భాగాన్ని విక్రయించే ఆలోచన చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. కంపెనీ ఈక్విటీలో 25 శాతాన్ని అమ్మే అంశాన్ని ఇపుడు కేంద్రం పరిశీలిస్తోంది. గతంలో కంపెనీలో తనకు ఉన్న మొత్తం 52.98శాతం వాటా అమ్మాలని భావించింది. బిడ్‌లను ఆహ్వానించింది. అయితే ఈ బిడ్‌లలో ఊహించిన దానికంటే ధర తక్కువ పలికింది. దీంతో కేంద్రం 20 శాతం లేదా 25శాతం వాటా అమ్మే అంశాన్ని పరిశిలిస్తోంది.