For Money

Business News

TS: బీర్‌ ధరలు పెంపు?

బీర్‌ ధరలను పెంచాలని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రతిపా దనలు కూడా సిద్ధం చేశారు. బీర్‌ ధరలను పెంచాలని కొంతకాలంగా డిస్టలరీల యాజమాన్యాలు కోరుతున్న నేపథ్యంలో బీర్‌ ధరల పెంపుపై ఎ క్సైజ్‌ ఉన్నతాధికారులు ఇటీవల కసరత్తు జరిపారు. ఒక్కో బీర్‌ ధరను రూ.10–20 పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రస్తుతం లైట్‌ బీర్‌ రూ.140 ఉండగా దాన్ని రూ.150, స్ట్రాంగ్‌ బీర్‌ రూ.150 ఉండగా, దాన్ని రూ.170 చేయనున్నట్లు సమాచారం.