For Money

Business News

పెసర దిగుమతులపై ఆంక్షలు

గత నవంబర్‌లో పెసరను స్వేచ్ఛగా దిగుమతి చేసుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం ఇపుడు… వాటి దిగుమతులపై ఆంక్షలు విధించింది. పెసర దిగుమతులను ఫ్రీ ఇంపోర్ట్‌ కేటగిరి నుంచి రెస్ట్రిక్టెడ్‌ కేటగిరికి మార్చుతూ ఈనెల 11వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి వీటిని ప్రభుత్వ అనుమతితోనే వీటిని దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇలా వెంటనే తన విధానాన్ని మార్చడంపై ఇండియా పల్స్‌ అండ్ గ్రెయిన్స్‌ అసోసియేషన్‌ (పీజీఏ) ఆందోళన వ్యక్తం చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం మార్చి 31లో దిగుమతులు చేసుకోవాలని, వాటికి జూన్‌లోగా కస్టమ్స్‌ నుంచి క్లియరెన్స్‌ తీసుకోవాలి. పాత ఉత్తర్వుల మేరకు తాము విదేశీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నామని… ఇపుడు విధానాన్ని మారిస్తే… తాము విదేశీ కంపెనీలతో మళ్ళీ సంప్రదింపులు చేయాల్సి ఉంటుందని… పాత కాంట్రాక్టులు రద్దు చేయడానికి తాము ఆర్థికంగా చాలా భారం మోయాల్సి ఉంటుందని పీజేఏ అంటోంది. ఏ ఏడాది పెసల పంట దిగుమతి బాగుంటుందని భావించినా… కర్ణాటక, రాజస్థాన్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో అకాల వర్షాల కారణంగా పంట దిగుబడి తగ్గే అవకాశముంది.ఇప్పటికే దేశీయ మార్కెట్‌లో పప్పు ధాన్యాలు రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో దిగుమతులపై ఆంక్షలు విధిస్తే… ధరలు మరింత పెరుగుతాయిన వ్యాపారస్థులు అంటున్నారు.