For Money

Business News

మేడ్చల్‌: రూ. 100 కోట్లతోఐటీ పార్క్‌

తెలంగాణా రాష్ట్రంలో అత్యంత ఎత్తైన భారీ ఐటీ పార్కును మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ గేట్ వే పేరిట 10 ఎకరాల్లో రూ. 100కోట్లతో నిర్మించనున్నారు. ఇందులో వంద సంస్థలకు స్థలం కేటాయించనున్నారు. ఇప్పటికే 70 కి పైగా సంస్థలు కార్యాలయ స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఈ పార్కు ద్వారా 50 వేల మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయని భావిస్తున్నారు.

17న శంకుస్థాపన
ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజైన 17 న దీనికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌ నలువైపులా ఐటీ అభివృద్ధిలో భాగంగా దీనిని అవుటర్ రింగ్ రోడ్డు వద్ద నిర్మించనున్నట్లు ఆయన చెప్పారు. గేట్‌వే ఐటీ టవర్‌తో హైదరాబాద్‌ పడమరలో అభివృద్ధి చెందిన ఐటీ పరిశ్రమ ఉత్తరానికి విస్తరిస్తుందన్నారు. టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహరెడ్డితో కలిసి ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. కండ్లకోయలో ఇప్పటికే కేటాయించిన 5 లక్షల ఎస్‌ఎఫ్‌టీ స్థలానికి సరిపడా వివిధ రాష్ట్రాలకు చెందిన ఐటీ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి రెండు, మూడో ఫేజ్‌లో కూడా ఇక్కడే ఐటీ అభివృద్ధి జరిగేలా కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు.

(photo Courtesy:Eenadu)