For Money

Business News

రాణించిన హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌

ఇన్సూరెన్స్‌ రంగంలో పోటీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కూడా హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఆకర్షణీయ ఫలితాలను సాధించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 357.52 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ నికర లాభం 12.4 శాతం పెరిగింది. కంపెనీ నికర ప్రీమియం ఆదాయం కూడా 11 శాతం పెరిగి రూ. 14,289 కోట్లకు చేరింది. నికర కమిషన్‌ రూ.620 కోట్లకు తగ్గగా, మేనేజ్‌మెంట్‌ ఖర్చులు 15 శాతం పెరిగాయి. మొత్తం ప్రీమియంలో ఆపరేటింగ్‌ ఖర్చులు స్వల్పంగా పెరిగి 12.3 శాతానికి చేరాయి. కొత్త వ్యాపారం 22 శాతం పెరగడం విశేషం. గత ఏడాది వృద్ధి కేవలం 14 శాతమే. అలాగే కొత్త వ్యాపార మార్జిన్‌ కూడా 27.4 శాతానికి పెరిగింది. కొత్త బిజినెస్‌ను పెంచుకొంటోంది కంపెనీ. కంపెనీ మార్జిన్స్‌ పరిశ్రమలోనే అత్యధికం.