For Money

Business News

బజాజ్‌ ఫైనాన్స్‌ నికర లాభం అదుర్స్‌

నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల్లో రారాజుగా వెలుగొందుతున్న బజాజ్‌ ఫైనాన్స్‌ మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.2419 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలోని రూ. 1346 కోట్లతో పోలిస్తే నికర లాభం 79.67 శాతం పెరిగింది. మార్కెట్‌ కూడా కంపెనీ నికర లాభం దాదాపు ఇదే స్థాయిలో ఉంటుందని అంచనా వేసింది. కంపెనీ చరిత్రలో ఈస్థాయి కన్సాలిడేటెడ్‌ నికర లాభం నమోదు కావడం ఇదే మొదటిసారి అని కంపెనీ పేర్కొంది. ఇక పూర్తి ఏడాది కంపెనీ ప్రకటించిన నికర లాభం రూ. 7028 కోట్లు. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర వడ్డీ ఆదాయం (NII) 30 శాతం పెరిగి రూ. 6068 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం రూ. 4659 కోట్లు. కొత్త రుణాలు 15 శాతం పెరిగాయని పేర్కొంది. ఒక్కో షేర్‌కు రూ. 2 డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. డివిడెండ్‌కు రికార్డు తేదీ జులై 1.