For Money

Business News

రూ. 50,000 దిగువకు స్టాండర్డ్‌ గోల్డ్‌!

మార్కెట్‌ విశ్లేషకుల అంచనా మేరకు ఇవాళ స్టాండర్డ్‌ బంగారం (24 క్యారెట్లు) ధర ఫ్యూచర్‌ మార్కెట్‌లో రూ. 50,000 దిగువకు వచ్చేసింది. స్పాట్‌ మార్కెట్‌లో కూడా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,000 పలుకుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అహ్మదాబాద్‌ స్పాట్‌ మార్కెట్‌లో స్టాండర్డ్‌ గోల్డ్‌ ధర రూ.50103 పలుకుతోంది. ఇక మలబార్‌ గోల్డ్‌లో ఇవాళ 22 క్యారెట్లు అంటే ఆర్నమెంట్‌ గోల్డ్‌ ధర రూ.46,350 రేటుకు ఆఫర్‌ చేస్తున్నారు. ఇక ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో స్టాండర్డ్‌ బంగారం ధర రూ. 50,000 దిగువకు వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర 1697.85 డాలర్లకు పడిపోవడంతో… ఎంసీఎక్స్‌లో (ఆగస్ట్‌ కాంట్రాక్ట్‌) పది గ్రాముల ధర రూ. 49,970 పలికింది. ఇపుడు రూ. 50121 వద్ద ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్లు ప్రారంభమయ్యాక బులియన్‌ రేట్లపై అనలిస్టులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఔన్స్‌ బంగారం ధర 1700 డాలర్ల వద్ద గట్టి సపోర్ట్ ఉంది. ఇది బ్రేక్‌ అయితే బంగారం ధర భారీగా క్షీణించే అవకాశముంది.