For Money

Business News

16000పైన ముగిసిన నిఫ్టి

మార్కెట్‌కు అమెరికా ప్యూచర్స్‌ ఉత్సాహన్ని ఇచ్చింది. మిడ్‌ సెషన్‌లో ప్రారంభమైన యూరో మార్కెట్లు కూడా ఆకర్షణీయ లాభాల్లో ట్రేడ్‌ కావడంతో నిఫ్టికి మద్దతు లభించింది. మిడ్‌ సెషన్‌లో 15927కు పడిన నిఫ్టికి… దిగువ స్థాయిలో గట్టి మద్దతు లభించింది. దీంతో దాదాపు వంద పాయింట్లకు పైగా లాభపడి 16049 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 110 పాయింట్లు లాభపడటం విశేషం. ముఖ్యంగా ఎఫ్‌ఎంసీజీ రంగంతో పాటు ఆటో రంగం నుంచి మార్కెట్‌కు గట్టి మద్దతు లభించింది. ఫార్మా, హాస్పిటల్స్‌కు కూడా ఓ మోస్తరు మద్దతు లభించింది. నిఫ్టి 0.7 శాతం లాభపడగా.. మిడ్‌ క్యాప్‌ నిఫ్టి ఒక శాతంపైగా లాభపడింది. అయితే ఇదే ఉత్సాహం అటు నిఫ్టి బ్యాంక్‌లోగాని.. నిఫ్టి నెక్ట్స్‌లోగాని కన్పించలేదు. నిఫ్టి బ్యాంక్‌ దాదాపు క్రితం ముగింపు వద్దే ముగిశాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఫలితాల తరవాత సోమవారం నుంచి ఈరంగానికి చెందిన షేర్లకు మద్దతు లభించవచ్చని అనలిస్టులు భావిస్తున్నారు.