For Money

Business News

లాభాల్లోనే నిఫ్టి

మిడ్‌సెషన్‌లో నష్టాల్లోకి జారుకున్నా.. వెంటనే కోలుకుంది నిఫ్టి. ఇవాళ్టి గరిష్ఠ స్థాయి నుంచి నిఫ్టి 110 పాయింట్లు క్షీణించి 15927ని తాకింది. తరవాత కోలుకుని ఇపుడు 15973 వద్ద 35 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. యూరో మార్కెట్లు గ్రీన్‌లో ప్రారంభం కావడంతో నిఫ్టి కూడా కోలుకుంది. ఉదయం అర శాతం వరకు లాభాల్లో ఉన్న అమెరికా ఫ్యూచర్స్‌ ఇపుడు అన్ని లాభాలను పోగొట్టుకున్నాయి. రెడ్‌లో ఉన్నా నామమాత్రమే. గత మూడు రోజులు నుంచి భారీగా నష్టపోయిన యూరో మార్కెట్లు ఇవాళ ప్రస్తుతానికైతే ఆకర్షణీయ లాభాల్లో ఉన్నాయి. యూరో స్టాక్స్‌ 50 సూచీ 0.84 శాతం లాభంతో ఉంది. జర్మనీ డాక్స్‌ కూడా 1.19 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఇక నిఫ్టి విషయానికొస్తే బ్యాంకు షేర్లు దెబ్బతీస్తున్నాయి. నిఫ్టి నెక్ట్స్‌ నుంచి కూడా ఎలాంటి మద్దతు లేదు. నిఫ్టి మిడ్‌క్యాప్‌ మాత్రం అరశాతం వరకు లాభాలతో ట్రేడవుతోంది. టాటా కన్జూమర్‌, టైటన్‌, భారతీ ఎయిర్‌ టెల్‌ షేర్లు రెండు శాతంపైగా లాభంతో ఉన్నాయి. టాటా స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, జిందాల్ స్టీల్‌ షేర్లు రెండు శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. చాలా వరకు ఆటో షేర్లు ఇవాళ రెండు శాతం వరకు లాభాల్లో ఉన్నాయి.