For Money

Business News

షియోమీకి ఈడీ షాక్‌

చైనాకు చెందిన షియోమీకి మనదేశంలో అనుబంధ కంపెనీగా ఉన్న షియోమి ఇండియాకు చెందిన సుమారు రూ.5,551 కోట్ల విలువైన ఆస్తుల‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. ఆ కంపెనీ ఫోరెక్స్ నిబంధనలకు ఉల్లంఘించి మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ గతంలోనే పేర్కొంది. స్మార్ట్‌ఫోన్ రంగంలో జియోమీ మేటి కంపెనీపై ఈడీ అధికారులు దాడులు చేసి పలు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. విదేశీ మార‌కంలో ఆ కంపెనీ అక్రమాల‌కు పాల్పడిన‌ట్లు ఈడీ వెల్లడించింది. దానికి కొనసాగింపుగా ఇవాళ షియోమీ ఇండియా కంపెనీకి చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఫెమా చ‌ట్టం కింద ఆ నిధులను సీజ్ చేసిన‌ట్లు ఈడీ తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవ‌రిలో షియోమీ కంపెనీ అక్రమంగా డ‌బ్బులు చెల్లించిన‌ట్లు ఈడీ త‌న విచార‌ణ‌లో తేల్చింది. షియోమీ కంపెనీ ఇండియాలో 2014 నుంచి పనిచేస్తోంది. ఇప్పటి వ‌ర‌కు ఆ కంపెనీ సుమారు 5,551 కోట్లను మూడు విదేశీ కంపెనీల‌కు మ‌ళ్లించిన‌ట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఇందులో రెండు కంపెనీలు అమెరికాలో ఉన్నవి. ఈడీ విచారణలో ఈ అమెరికా కంపెనీల అసలు యజమాని చైనా కంపెనీగా తేల్చింది. 2014 నుంచి mi బ్రాండ్‌తో ఫోన్లను అమ్ముతున్న షియోమీ 2015 నుంచే విదేశాలకు నిధులను పంపుతోంది.