For Money

Business News

రెబ్బా సత్యనారాయణ ఆస్తులు జప్తు

భీమవరం చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రెబ్బా సత్యనారాయణ (Rebba Satyanarayana) ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. ఆయనకు, ఆయన కుటుంబానికి చెందిన దాదాపు రూ.100 కోట్ల విలువైన ఆస్తుల్ని అటాచ్ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇవాళ ప్రకటించింది. 2002లో ఐడీబీఐ బ్యాంక్‌ నుంచి తమ కంపెనీ ఆర్‌వీఆర్‌ మెరైన్‌ ప్రొడక్ట్స్‌ (RVR Marine Products Limited) పేరుతో రుణాలు తీసుకుని మోసం చేసినందుకు ఆయనపై సీబీఐ కేసు ఈడీ విచారణ చేపట్టింది. రెబ్బా సత్యనారాయణకు చెందిన వ్యవసాయ భూములు.. చేపల చెరువులు, కమర్షియల్ భూములు, ఫ్లాట్స్‌ను ఈడీ అటాచ్ చేసింది. 143 మంది బినామీల పేరిట రుణాలు పొంది మోసం చేసినట్లు ఈడీ పేర్కొంది. అమెరికాకు 24 లక్షల డాలర్ల విలువైన చేపలను, రొయ్యలను సత్యనారాయణ ఎగుమతి చేసినట్లు ఈడీ పేర్కొంది.  తెలంగాణ, ఏపీలలోని ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. కంపెనీలో సత్యనారాయణతో పాటు రెబ్బా సతీష్‌కుమార్‌, కన్నా మురళి, రెబ్బా ధనలక్ష్మీ కంపెనీడైరెక్టర్లుగా ఉన్నారు.