For Money

Business News

బియ్యం ఎగుమతులపై సుంకం విధింపు

దేశీయంగా బియ్యం ధరలు భారీగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈసారి ఖరీఫ్‌ సీజన్‌లో వరి పండించే మెజారిటీ రాష్ట్రాల్లో వర్షాలు సరిగా లేకపోవడంతో పంట దిగుబడి తగ్గనుంది. ఇప్పటికే బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు 15 నుంచి 20 శాతం పెరిగాయి. పరిస్థితి మరింత తీవ్రం దాల్చకుండా కేంద్ర ప్రభుత్వం బయ్యం ఎగుమతులపై 20 శాతం సుంకం విధించింది. వివిధ రకాల గ్రేడ్‌లను బట్టి ఈ సుంకం విధించారు. గోధుమ పంట దిగుబడి కూడా బాగా తగ్గుతుందని అంచనాతో ఇప్పటికే గోధుమల ఎగుమతిపై నిషేధం విధించింది. చెరకు బాగా పండించే యూపీ, బీహార్‌లలో పంట దిగుబడి తగ్గే అవకాశం ఉన్నందున… చక్కెర ఎగుమతులపై కేంద్రం ఇప్పటికే ఆంక్షలు విధించింది.