For Money

Business News

సూపర్‌ లాభాలతో ముగింపు

మిడ్‌ సెషన్‌లో కాస్త తడబడిన నిఫ్టి.. ఆ తరవాత కోలుకుంది. బ్యాంక్‌ నిఫ్టి అందించిన మద్దతుతో 17800 స్థాయిని దాటింది. క్లోజింగ్‌లో 17798 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 174 పాయింట్ల లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ 659 పాయింట్ల లాభంతో క్లోజైంది. యూరప్‌ మార్కెట్లు గ్రీన్‌లో ఉండటం, అమెరికా ఫ్యూచర్స్‌ నష్టాల నుంచి బయటపడటం…నిఫ్టికి కలిసి వచ్చిన ఇతర అంశాలు. ఇవాళ నిఫ్టి లాభాలకు ప్రధాన కారణం.. బ్యాంక్‌ షేర్లు. నిఫ్టి బ్యాంక్‌ ఇవాళ 1.91 శాతం లాభంతో 40,208 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టి లాభాలకు ప్రధాన కారణం బ్యాంక్‌ షేర్లలో వచ్చిన ర్యాలీనే. నిఫ్టి నెక్ట్స్‌, నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీలు 0.2 శాతం మాత్రమే లాభపడినా.. నిఫ్టి ఒక శాతం లాభపడింది. యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ సూపర్‌ లాభాలు ఆర్జించాయి. ఇక నిఫ్టిలో శ్రీ సిమెంట్‌, బీపీసీఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. మెటల్స్‌లో హిందాల్కో మూడు శాతం నష్టపోగా, టాటా స్టీల్‌ కూడా ఒకటిన్నర శాతం నష్టపోయింది.