For Money

Business News

ఒత్తిడి ఉన్నా… 17700పైనే..

యూరప్‌ మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. కొన్ని మార్కెట్లు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. అమెరికా ఫ్యూచర్స్‌ స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టి 17700పైనే కొనసాగుతోంది. ఒకదశలో 17691ని తాకినా వెంటనే కోలుకుంది. నిఫ్టి 112 పాయింట్ల లాభంతో 17736 వద్ద ప్రస్తుతం ట్రేడవుతోంది. గత రెండు రోజుల నుంచి సిమెంట్లు షేర్లు భారీగా పెరిగాయి. అలాగే ముడి చమురుతో లింక్‌ ఉన్న అన్ని కంపెనీల షేర్లు ముఖ్యంగా పెయింట్‌, టైర్‌ కంపెనీల షేర్లు ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి. ఇక బ్యాంక్‌ నిఫ్టి చాలా పటిష్ఠంగా ఉంటోంది. మెటల్స్‌పై కాస్త ఒత్తిడి ఉన్నా.. ఇతర రంగాల షేర్ల అండగా ఉంటున్నాయి. వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ ఒత్తిడి నిఫ్టిపై కాస్త ఉండొచ్చు.