For Money

Business News

20 ఏళ్ళ గరిష్ఠానికి డాలర్‌

అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్‌లో ప్రధాన కరెన్సీలు బలహీనపడటంతో… డాలర్‌ రోజురోజుకీ బలపడుతోంది. ముఖ్యంగా జపాన్‌ యెన్‌ భారీగా క్షీణించడం.. డాలర్‌కు ప్లస్‌గా మారింది. రాత్రి డాలర్‌ ఇండెక్స్‌ 103.93ని తాకింది. 2002 తరవాత డాలర్‌ ఇండెక్స్‌ ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. యూరప్‌, ఆసియా అభివృద్ధి రేటుపై అనుమానాలు పెరుగుతుండటమే రాత్రి అమెరికా జీడీపీ తగ్గినట్లు డేటా వచ్చినా… డాలర్‌క మద్దతు పెరుగుతూనే ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ చాలా పటిష్ఠంగా ముందుకు సాగుతోందని… అయితే వాణిజ్య లోటు కారణంగా జీడీపీ తగ్గిందని ఆర్థికవేత్తలు అంటున్నారు. యెన్‌తోపాటు యూరో కూడా బలహీనంగా మారడం డాలర్‌ కలిసివస్తోంది. ఏప్రిల్‌ నెలలో యూరో 5 శాతం క్షీణించిది. ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన తరవాత యూరో 7 శాతంపైగా క్షీణించింది. స్టెర్లింగ్‌ కూడా 22 నెలల కనిష్ఠానికి క్షీణించింది.