For Money

Business News

అంచనాలకు దగ్గరగా దివీస్‌ ల్యాబ్ ఫలితాలు

జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో దివీస్‌ ల్యాబొరేటరీస్‌ రూ. 2254 కోట్ల ఆదాయంపై రూ. 702 కోట్ల నికర లాభం ప్రకటించింది.కంపెనీ రూ. 2326 కోట్ల ఆదాయంపై రూ. 698 కోట్ల నికరలాభం ఆర్జిస్తుందని సీఎన్‌బీసీ టీవీ18 సర్వే అంచనా వేసింది. నికర లాభం విషయంలో కంపెనీ మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగానే ఉన్నా.. ఆదాయం 3 శాతం క్షీణించింది.అలాగే మార్జిన్‌ 43.5 శాతం ఉంటుందని అంచనా వేయగా, 37.6 శాతం మాత్రమే వచ్చింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే మాత్రం కంపెనీ అద్భుత ఫలితాలు సాధించినట్లు కంపెనీ ఆదాయం 15 శాతం పెరగ్గా, నికర లాభం 26 శాతం పెరిగింది. మార్జిన్‌ విషయంలోనే ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. 43.5 శాతం నుంచి 37.6 శాతానికి అంటే 5.9 శాతం మార్జిన్‌ తగ్గడంతో షేర్‌పై ఒత్తిడి పెరుగుతోంది. నిన్న రూ. 3948 వద్ద ముగిసిన షేర్‌ రూ.3761ని తాకి ఇపుడు రూ. 3769 వద్ద ట్రేడవుతోంది. అంటే దాదాపు 4.5 శాతం క్షీణించినట్లు. మరి దిగువస్థాయిలో దివీస్‌ షేర్‌కు మద్దతు లభిస్తుందేమో చూడాలి.