For Money

Business News

రూ. 100 క్షీణించిన దివీస్‌ ల్యాబ్‌

జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి దివీస్‌ ల్యాబ్‌ ఇవాళ ఆర్థిక ఫలితాలను ప్రకటించనుంది. ఫలితాల నేపథ్యంలో ఈ షేర్‌పై ఒత్తిడి వస్తోంది. నిన్న రూ.3948 వద్ద ముగిసిన ఈ షేర్‌ ఇవాళ ఓపెనింగ్‌లో రూ. 3844కు అంటే రూ.104లు క్షీణించింది. దిగువ స్థాయి నుంచి కోలుకుని ఇపుడు రూ. 1860 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో అపోలో హాస్పిటల్స్‌ తరవాత రెండో స్థానంలో ఉంది. గత మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ చక్కటి పనితీరు కనబర్చింది. అయితే కోవిడ్‌ కేసులు భారీగా తగ్గిన నేపథ్యంలో గైడెన్స్‌ ఇచ్చేందుకు కంపెనీ నిరాకరించింది. దీంతో షేర్‌ ధర రూ.3365కు పడిపోయింది. అక్కడి నుంచి 20 శాతంపైగా కోలుకుని రూ. 3900ను దాటింది. మరి ఇవాళ వచ్చే ఫలితాల కోసం ఇన్వెస్టర్లు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
38 శాతం తగ్గనున్న లాభం?
దివీస్‌ ఫలితాలపై తన అంచనాలను ఈటీ నౌ ఛానల్‌ ఇవాళ ప్రసారం చేసింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 2220 కోట్ల ఆదాయంపై రూ. 650 కోట్ల నికర లాభం ప్రకటించవచ్చని అంచన. అంటే మార్చితో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ ఆదాయం 13 శాతం, నికర లాభం 38 శాతం తగ్గే అవకాశముందని ఆ ఛానల్‌ పేర్కొంది. గత త్రైమాసికంలో కంపెనీ రూ. 2518 కోట్ల ఆదాయంపై రూ. 894 కోట్ల నికర లాభం ప్రకటించింది. కంపెనీ మార్జిన్స్‌ కూడా 43.9 శాతం నుంచి 41.4 శాతానికి తగ్గుతాయని పేర్కొంది. మరి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.