For Money

Business News

దుమ్ము రేపిన దివీస్‌ ల్యాబ్‌

మార్చితో ముగిసిన త్రైమాసికంలో దివీస్‌ ల్యాబ్‌ అద్భుత ఫలితాలను ప్రకటించింది. మార్కెట్‌ అంచనాలకు మించి ఆదాయం, లాభాన్ని వెల్లడించింది. మార్చితో ముగిసిన చివరి మూడు నెలల్లో కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ.894.64.96 కోట్లుగా ప్రకటించింది. మార్కెట్‌ విశ్లేషకులు రూ. 650 కోట్ల నికర లాభాన్ని అంచనా వేశారు. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ ప్రకటించిన నికర లాభం రూ.502.02 కోట్లు. ఇదే కాలంలో కంపెనీ ఆదాయం కూడా రూ. 1788 కోట్ల నుంచి రూ. 2518 కోట్లకు చేరింది. ఈ త్రైమాసానికి ఈపీఎస్‌ రూ.18.91 నుంచి రూ.33.70కు పెరిగింది. అదే డిసెంబర్‌ నెలతో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ పనితీరు స్థిరంగా ఉందనిపిస్తోంది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.2493 కోట్ల టర్నోవర్‌పై రూ.902.24 కోట్ల నికర లాభం ప్రకటించింది. 2020-21 పూర్తి ఏడాదికి రూ.6969 కోట్ల టర్నోవర్‌పై రూ.1984 కోట్ల నికర లాభం ప్రకటించగా, 2021-22లో కంపెనీ రూ.8959 కోట్ల టర్నోవర్‌పై రూ.2960 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2021-22 ఏడాదికి రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.30 డివిడెండ్‌ ఇవ్వాలని కంపెనీ బోర్డు ప్రతిపాదించింది. ఫలితాలకు స్పందిస్తూ షేర్‌ రూ.96 లాభంతో రూ.4400 వద్ద ట్రేడవుతోంది.