For Money

Business News

ముడి చమురు @124

నిన్న రాత్రి అమెరికాలో చమురు నిల్వల డేటా వెల్లడైంది. ప్రతి బుధవారం అమెరికా తన వద్ద ఉన్న చమురు నిల్వల డేటాను వెల్లడిస్తుంది. రాత్రి వచ్చిన డేటా అంచనాలకు మించి తగ్గడంతో… ఆయిల్‌ రేట్లు మళ్ళీ పెరుగుతున్నాయి. అమెరికాలో చమురు వినియోగం బాగా పెరుగుతోంది. దీంతో నిల్వలు తగ్గుతున్నాయి. ఇప్పటికే రష్యా ఆంక్షలతో భారీగా పెరిగిన బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు ఇపుడు 124 డాలర్లకు చేరాయి. ఆసియా దేశాలు కొనే బ్రెంట్‌ క్రూడ్‌, అమెరికా మార్కెట్‌లో విక్రయించే WTI క్రూడ్ ధరల మధ్య వ్యత్యాసం కూడా తగ్గుతోంది. WTI క్రూడ్‌ కూడా ఇపుడు 122.5 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. క్రూడ్‌ సరఫరా పెంచేందుకు వివిధ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. మరోవైపు రష్యా కూడా తన ఆయిల్ సరఫరాను కట్టడి చేస్తోంది. డాలర్‌ మళ్ళీ పెరుగుతోంది. రాత్రి అమెరికా మార్కెట్‌లో డాలర్‌ ఇండెక్స్‌ 102.6కు చేరింది. దీంతో భారత్‌ వంటి వర్ధమాన దేశాలపై ఆర్థిక భారం భారీగా పడుతోంది.