For Money

Business News

డాలర్‌ ఢమాల్‌… క్రూడ్‌ జూమ్‌

అమెరికా వినియోగ ధరల సూచీ దెబ్బకు డాలర్‌ బక్కచిక్కిపోయింది. కరెన్సీ మార్కెట్‌ డాలర్‌ ఇండెక్స్‌ 0.66 శాతం క్షీణించి 94.99 వద్ద ట్రేడవుతోంది. దీంతో వాల్‌ స్ట్రీట్‌ ఒక మోస్తరు లాభాలతో ట్రేడవుతోంది. ఇన్ఫోసిస్‌ ఏడిఆర్‌ అయిదు శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. నాస్‌డాక్‌ అర శాతం లాభపడగా, డౌజోన్స్‌ సూచీ స్వల్ప లాభంతో ట్రేడవుతోంది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.35 శాతం లాభంతో ట్రేడవుతోంది. డాలర్‌ బలహీన పడటంతో కమాడిటీస్‌ బాగా బలపడ్డాయి. ముఖ్యంగా క్రూడ్‌ రెండు శాతం దాకా లాభపడింది. ఆసియా దేశాలు కొనుగోలు చేసే బ్రెంట్‌ క్రూడ్‌ ఏకంగా 85 డాలర్లను క్రాస్‌ చేసింది. ఇక బులియన్‌ మార్కెట్‌ కూడా గ్రీన్‌లోఉంది. బంగారం అర శాతం, వెండి ఒక శాతం లాభంతో ట్రేడవుతున్నాయి.