For Money

Business News

US: ద్రవ్యోల్బణం 40 ఏళ్ళ గరిష్ఠానికి

అమెరికా వార్షిక ద్రవ్యోల్బణ సూచీ 40 ఏళ్ళ గరిష్ఠానికి చేరింది. నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనివిధంగా 2021లో వినియోగ ధరల సూచీ ఏడు శాతం పెరిగిందని అమెరికా కార్మిక విభాగం వెల్లడించింది. ఒక్క నవంబర్‌లోనే ద్రవ్యోల్బణం 0.5 శాతం పెరిగింది. ఆహారం, ఇంధన ధరలను పక్కన బెట్టినా… కీలక రంగాల ధరలు భారీగా పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ నెలలో 5.5 శాతం పెరిగినట్లు అమెరికా లేబర్‌ విభాగం వెల్లడించింది. నవంబర్‌ 0.8 శాతం పెరిగిన వినియోగ ధరల సూచీ డిసెంబర్‌లో 0.5 శాతం పెరిగింది. దీంతో సీపీఐ ఏడు శాతానికి చేరింది. 1982 జూన్‌ తరవాత అమెరికాలో వినియోగ ధరల సూచీ ఈ స్థాయికి రావడం ఇదే మొదటిసారి.