For Money

Business News

వినియోగ ధరలు మండిపోతున్నాయి

డిసెంబర్‌ నెలకు వినియోగ ధరల సూచీ (CPI)5.59 శాతంగా నమోదైంది. నవంబర్‌తో పోలిస్తే ఈ సూచీ 0.68 శాతం అధికం. అక్టోబర్‌-డిసెంబర్‌ డేటా ప్రకారం వినియోగదారుల సూచీ 5.1 శాతం ఉండాలి. కాని తన అంచనాలకు భిన్నంగా వాస్తవ ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నా ఆర్బీఐ పట్టించుకోవడం లేదు. మధ్య కాలంలో ద్రవ్యోల్బణం 4 శాతం ఉంటుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. ఆర్బీఐ అంచనా తప్పడం వరుసగా ఇది 27వ నెల. అయితే ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచడం లేదు. ఫిబ్రవరిలో జరిగే పరపతి విధాన సమీక్షలో కూడా వడ్డీ రేట్లను ఆర్బీఐ పెంచకపోవచ్చని తెలుస్తోంది.