For Money

Business News

సిమెంట్‌ డీల్‌కు సీసీఐ ఓకే

అంబుజా‌, ఏసీసీ సిమెంట్‌ కంపెనీల్లో స్వీడన్‌ కంపెనీ హోలిమ్స్‌కు చెందిన నియంత్రిత వాటాను అదానీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ డీల్‌కు కాంపీటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (CCI) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అదానీ గ్రూప్‌కు చెందిన ఎండీవర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా హోలిమ్స్‌కు చెందిన హోల్డెరిండ్ ఇన్వెస్ట్‌మెంట్స్, అంబుజా సిమెంట్స్, ఏసీసీలో వాటా కొనుగోళ్లకు ఆమోదం తెలిపినట్లు సీసీఐ పేర్కొంది. ఈ ఒప్పందం తరవాత హోల్డెరిండ్‌లో ఎండీవర్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కు మెజారిటీ వాటా దక్కనుంది. అదానీ కంపెనీ ఎండీవర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ మారిషస్‌ కేంద్రంగా ఈ కంపెనీ కార్యకలాపాలు సాగిస్తోంది. తాజా డీల్‌తో హోలిమ్స్‌కు అంబుజాలో ఉన్న 63.11 శాతం, ఏసీసీలోని 4.48 శాతం వాటాలు అదానీ చేతికి వస్తాయి. అంబుజా సిమెంట్‌కు ఏసీసీలో 50.05 శాతం ఉన్నందున.. ఆ కంపెనీ కూడా ఆటోమేటిగ్గా అదానీ టేకోవర్‌ చేసినట్లవుతుంది.