For Money

Business News

మరో పాన్‌ ఇండియా బ్లాక్‌బస్టర్‌

మేధావులు ఏమన్నా, క్రిటిక్స్‌ రివ్యూలు ఎలా ఉన్నా… కార్తికేయ-2 సినిమా సూపర్‌ హిట్ టాక్‌ తెచ్చుకుంది. ముఖ్యంగా హిందీ బెల్ట్‌లోని బీ, సీ సెంటర్లలో ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌ చూస్తుంటే… అక్షయ్‌ కుమార్‌ నటించిన ‘రక్షా బంధన్‌’ మూవీకి ప్రమాదమే. మల్టిప్లెక్స్‌లో నడుస్తున్న ‘లాల్‌ సింగ్‌ చడ్డా’కి కూడా ఈ వారాంతంలో నిఖిల్‌ మూవీ నుంచి చాలా గట్టి పోటీ ఎదురుకానుంది. నిజానికి ఈ వారం విడుదలైన ఈ రెండు హిందీ సినిమాలు.. కార్తికేయ-2 దెబ్బకు కొన్ని వందల స్క్రీన్స్‌ను కోల్పోయే అవకాశముంది. ఈ సినిమా పబ్లిక్‌ రియాక్షన్‌ చూస్తుంటే … బాగా లేదన్నవారు పదిమందికి ఒక్కడు కూడా కన్పించడం లేదు. థియేటర్‌ బయటకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడు థ్రిల్‌గా ఫీలవుతున్నాడు. అమీర్‌ ఖాన్‌, అక్షయ్‌ మూవీల కారణంగా కార్తికేయ-2కు తగినన్ని స్క్రీన్స్‌ లభించలేదు. నిజానికి ఈ నిఖిల్‌ సినిమాకు సౌత్‌ కన్నా ఉత్తరాది ప్రేక్షకులే అధికంగా కనెక్ట్‌ అవుతున్నారు. చాలా వరకు ఇలాంటి కథలు నార్త్‌లో బాగా కనెక్ట్‌ అవుతాయి. పైగా సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా… కార్తికేయ-2 సినిమా ప్రేక్షకులన్ని కట్టి పడేస్తోంది. ముఖ్యంగా శ్రీకృష్ణుడి చుట్టూ సాగే కథ కావడంతో… ప్రేక్షకుడిలో ఆసక్తి కల్గడం.. దాన్ని చివరిదాకా తీసుకెళ్ళడంలో డైరెక్టర్‌ విజయం సాధించాడు. సినిమా కథ, యాక్టింగ్‌, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌.. ఇలా పలు విభాగాల గురించి ప్రత్యేక విశ్లేషణ ఈ సినిమాకు అక్కర్లేదనిపిస్తోంది. ఎందుకంటే ప్రేక్షకుడి ఆద్యంతం కట్టిపడేయడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయిన తరవాత ఇతర అంశాల చర్చ అనవసరం. బహుశా ఉత్తరాదిలో థియేటర్స్‌ లేకపోవడం వల్ల ఓపెనింగ్స్‌ తక్కువగా ఉన్నా… క్రమంగా పుంజుకోవడం ఖాయంగా కన్పిస్తోంది. అక్షయ్‌, అమీర్‌ సినిమా స్క్రీన్స్‌ సంఖ్య బాగా తగ్గొచ్చు. డిఫరెంట్‌ సబ్జెక్ట్‌లతో వస్తున్న సౌత్‌ మూవీస్‌… బాలీవుడ్‌ను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. మొత్తం పరిశ్రమ పునరాలోచనలో పడిపోయింది. రెండున్నర గంటలు ప్రేక్షకుడిని థియేటర్‌లో కూర్చోబెట్టడం ఎలా అన్నది ఇపుడు బాలీవుడ్‌ ప్రస్తుత జనరేషన్‌ను వేధిస్తున్న ప్రశ్న. బాలీవుడ్‌కు మరో షాకింగ్‌ న్యూస్‌.. ‘సీతారామం’ హిందీ వెర్షన్‌ ఈ నెల 19న విడుదల కానుండటం.