For Money

Business News

బంగారం మరింత తగ్గుతుంది

ఈసారి దీపావళికి బంగారం కొనే వారికి మరో శుభవార్త. వచ్చేవారం పది గ్రాముల స్టాండర్డ్‌ బంగారం అంటే 24 క్యారెట్లు బంగారం ధర రూ.50,000 దిగువకు రానుంది. ఎంసీఎక్స్‌లో ధర రూ. 49,700 లేదా రూ. 49500లకు తాకే అవకాశముందని ఐఐఎఫ్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అనుజ్‌ గుప్తా తెలిపారు. గత నెలలో ఇదే స్థాయిలో మద్దతు లభించింది. మరి ఈ వారం ఇదే రిపీట్‌ అవుతుందా లేదా మరింత తగ్గుతుందా అనేది చూడాలి. శుక్రవారం రూ.604 తగ్గి రూ. 50,280 స్థాయిని తాకింది. గత వారం బంగారం 3.3 శాతం తగ్గింది.
వెండి విషయానికొస్తే
గతవారం వెండి 9 శాతం క్షీణించింది. గత శుక్రవారం కిలో వెండి ధర రూ.55200ని తాకింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా వెండి ఇదే స్థాయిలోనష్టపోయింది. బంగారం, వెండి ధరలు మున్ముందు కూడా తగ్గనున్నాయి. వెండి ధర రూ. 54,000 లేదా రూ. 53000లను తాకే అవకాశముందని ఐఐఎఫ్‌ఎల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అనుజ్‌ గుప్తా అన్నారు.