For Money

Business News

పరోటాపై 18 శాతం జీఎస్టీ

రోటీ లేదా చపాతీలా కేవలం పిండితో మాత్రమే చేయరు కాబట్టి పరోటాపై 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సిందేనని గుజరాత్‌ అప్పిలేట్‌ అథారిటీ ఫర్‌ అడ్వాన్స్‌ రూలింగ్‌ పేర్కొంది. రోటీ లేదా చపాతీని తయారీలో కేవలం పిండి, నీరు మాత్రమే వాడుతారని పేర్కొంది. పరోటా తయారీలో అనేక ఇతర ఆహార పదార్థాలు వాడుతరని, పైగా దీన్ని ఫ్రిజ్‌లో నిల్వ ఉంచురాని.. దీన్ని మళ్ళీ వేడి చేయాల్సి ఉన్నందున… 18 శాతం జీఎస్టీ వసూలు చేసింది. రోటీ లేదా చపాతీ తయారీకి, పరోటా  తయారీకి ముడి పదార్థం ఒకటే కాబట్టి 5 శాతం జీఎస్టీకి అనుమతించాలంటూ వాడిలాల్‌ ఇండస్ట్రీస్‌ చేసిన వాదనను అప్పిలేట్‌ అథారిటీ తిరస్కరించింది. ప్యాక్‌ చేసిన పరోటా .. చపాతీ కాదని తేల్చింది.