For Money

Business News

డీమార్ట్‌.. లాభంలో 64 శాతం వృద్ధి

డీమార్ట్‌ పేరిట రీటైల్‌ స్టోర్స్‌ నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ కంపెనీ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికం ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. ఈ త్రైమాసికంలో రూ.10,638.33 కోట్ల టర్నోవర్‌పై రూ.685.71 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాదితో పోలిస్తే నికర లాభం 64 శాతం వృద్ధి నమోదు కాగా, ఆదాయం 37 శాతం పెరిగింది. గతేడాది ఇదే సమయంలో ఈ కంపెనీ రూ.7,788.94 కోట్ల ఆదాయంపై రూ.417.76 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. సరిగ్గా పదేళ్ళ క్రితం 2002లో డీమార్ట్‌ ముంబయిలో తొలి స్టోర్‌ను ప్రారంభించగా ఇపుడు దేశవ్యాప్తంగా 18 నగరాల్లో 302 స్టోర్లను నిర్వహిస్తోంది. చాలా వరకు పెద్ద పట్టణాలు, నగరాలలోనే ఈ కంపెనీ తన స్టోర్స్‌ను ప్రారంభిస్తోంది. ఇటీవలే విజయవాడ మార్కెట్‌లో ప్రవేశించింది.