For Money

Business News

BSNL-MTNL విలీనం వాయిదా

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలైన BSNL, MTNL విలీన ప్రతిపాదనను ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత్ బ్రాడ్‌బ్యాంట్‌ నెట్‌వర్క్‌ లిమిటెడ్ (బీబీఎన్ఎల్), బీఎస్ఎన్ఎల్ విలీన ప్రతిపాదన మాత్రమే ప్రస్తుతం పరిశీలనలో ఉందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ రాజ్యసభకు రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. 2019 అక్టోబరు 23 న బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ల పునరుద్ధరణ ప్రణాళికకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి విదితమే. MTNLకు అధిక రుణ భారం వల్ల, ఇతర ఆర్థిక కారణాలతో BSNL-MTNL విలీన ప్రతిపాదనను వాయిదా వేసినట్లు చౌహాన్ వివరించారు.