For Money

Business News

నాస్‌డాక్‌ మళ్ళీ 2 శాతం డౌన్‌

వాల్‌స్ట్రీట్‌లో టెక్ షేర్లలో ఒత్తిడి కొనసాగుతోంది. నిన్న 2 శాతం క్షీణించిన నాస్‌డాక్‌ ఇవాళ మరో 2.30 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ప్రధాన టెక్‌, ఐటీ కంపెనీల షేర్లన్నీ నష్టాల్లో ఉన్నాయి. ఉదయం ఆసియా మార్కెట్ల నుంచి యూరో మార్కెట్ల వరకు ఇపుడు అమెరికా మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. యూరో మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమైనా… ఇపుడు రెండు శాతంపైగా నష్టంతో ఉన్నాయి. ఇక అమెరికాలో టెక్‌, ఐటీ షేర్ల దెబ్బకు ఎస్‌ అండ్ పీ 500 సూచీ కూడా ఒక శాతంపైగా క్షీణించింది. డౌజోన్స్ నష్టం 0.62 శాతం. గత మార్చిలో జరిగిన ఫెడ్‌ మీటింగ్‌ మినిట్స్‌ ఇవాళ బయటపెడ్తారు. మరో వైపు కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ పెరుగుతూనే ఉంది. మార్కెట్‌ అంచనాలకు మించి అమెరికాలో వారాంతపు చమురు నిల్వలు ఉండటంతో క్రూడ్‌పై ఒత్తిడి వచ్చింది. బ్రెంట్‌ క్రూడ్‌ 105 డాలర్లలోపు ఉంది.