For Money

Business News

80 డాలర్లకు చేరువలో క్రూడ్‌!

దాదాపు ఆ స్థాయిని తాకింది క్రూడ్‌ ఆయిల్‌. అమెరికా మార్కెట్‌ సమయంలో ఆసియా దేశాలు కొనుగోలు చేసే బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర 79.72 డాలర్లకు చేరింది. అమెరికా మార్కెట్‌లో ట్రేడయ్యే WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 75.74 డాలర్లకు చేరింది. ఒపెక్‌ ప్లస్‌ దేశాలు ఆయిల్‌ సరఫరాపై గట్టి నియంత్రణ పాటించడం, మరోవైపు కరోనా నుంచి బయట పడిన దేశాల్లో క్రూడ్‌కు భారీ డిమాండ్ ఏర్పడటం.. దీనికి కారణంగా మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా డాలర్‌ మారకం రేటును బట్టి కూడా క్రూడ్‌ ధర మారుతూ ఉంటుంది. సాధారణంగా డాలర్‌ పెరిగితే క్రూడ్‌ ధర తగ్గుతుంది. దీనివల్ల భారత్‌ వంటి వర్ధమాన దేశాలకు కాస్త ఊరట. కాని ఈసారి డాలర్‌తో పాటు క్రూడ్‌ పెరుగుతోంది. దీనివల్ల మనం కొనుగోలు చేసే క్రూడ్‌ ధర వాస్తవానికి 80 డాలర్లను దాటిపోతుంది. ఎందుకంటే డాలర్‌ తగ్గినపుడు, క్రూడ్‌ పెరుగుతుంది…ఇదే సమయంలో రూపాయి మారకం పెరుగుతుంది కాబట్టి… క్రూడ్‌ వాస్తవ పెరుగదల తక్కువగా ఉంటుంది. ఇపుడు సీన్ మారింది. ఇక డాలర్‌ స్వల్పంగా పెరగడంతో బులియన్‌లో ముఖ్యంగా బంగారం ధరలో పెద్ద మార్పు లేదు.కాని వెండి ధర 1.25 శాతం పెరిగింది.