For Money

Business News

వాల్‌స్ట్రీట్‌: టెక్‌ షేర్లలో ఒత్తిడి

ఇవాళ వాల్‌స్ట్రీట్‌ మిశ్రమంగా ప్రారంభమైంది. డౌజోన్స్‌ అర శాతం వరకు లాభంతో ట్రేడవుతుండగా ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ స్వల్ప నష్టంతో ఉంది. అయితే టెక్నాలజీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతూనే ఉంది. ఇవాళ కూడా నాస్‌డాక్‌ 0.6 శాతం క్షీణించింది. డాలర్‌ స్థిరంగా ఉంది. 10 ఏళ్ళ ప్రభుత్వ బాండ్లపై ఈల్డ్స్‌ పెరుగుతుండటమే దీనికి ప్రధాన కారణం. క్రూడ్‌ ఆయిల్ పెరగడంతో ఎనర్జి షేర్లు, బ్యాంకు షేర్లు పెరగడంతో డౌజోన్స్‌ పెరిగింది. నాస్‌డాక్‌లో ప్రధాన టెక్‌ షేర్లు ఒక మోస్తరుగా నష్టపోయాయి. అమెజాన్, యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌ షేర్లు రెండు శాతం దాకా నష్టంతో ట్రేడవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌ కిడ్స్‌పై జరుగుతున్న పరిశోధనను ఆపుతున్నట్లు ఫేస్‌బుక్‌ వెల్లడించడంతో ఆ కంపెనీ షేర్‌ ఒక శాతంపైగా నష్టపోయింది.