For Money

Business News

మళ్ళీ 71 డాలర్లకు క్రూడ్‌

గతవారం వరుసగా ఏడు రోజులు క్షీణించిన క్రూడ్‌ ఆయిల్‌ ధర.. మళ్ళీ అంతకన్నా వేగంగా పెరిగింది. బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర గతవారం 65 డాలర్లకు పడిపోగా… ఇవాళ 71 డాలర్లను దాటింది. అమెరికాలో ప్రతివారం బుధవారం వెలువడి వీక్లీ క్రూడ్‌ ఆయిల్‌ స్టాక్‌ అంచనా వేసినదానికన్నా తక్కువ ఉండటంతో ధరలు పెరగడం ప్రారంభించాయి. డాలర్‌ స్థిరంగా ఉండటంతో బ్రెంట్ క్రూడ్‌ 71 డాలర్లను దాటింది. డాలర్‌ ఇక ఏమాత్రం క్షీణించినా… క్రూడ్‌ మరింత పెరిగే అవకాశముంది. మరోవైపు బులియన్‌ మాత్రం నష్టాల్లో ఉంది.
స్థిరంగా వాల్‌ స్ట్రీట్‌…
యూరప్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో ట్రేడ్‌ కాగా, అమెరికా మార్కెట్లు కూడా అలానే ఏన్నాయి. గత కొన్ని రోజులుగా పెరిగిన నాస్‌డాక్‌ ఇవాళ స్థిరంగా ఉంది. ఎస్‌ అండ్‌ పీ 500, డౌ జోన్స్‌ సూచీలు 0.3 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి.