For Money

Business News

బియ్యం కిలో రూ.25కే..!

సార్వత్రిక ఎన్నికలు సమీస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ద్రవ్యోల్బణం తగ్గించేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఆహార ధాన్యాల ధరలు తగ్గించే సబ్సిడీలను పెంచుతోంది. ఇప్పటికే భారత్‌ ఆటా, భారత్‌ దాల్‌ పేరుతో గోధుమ పిండి, పప్పు ధాన్యాలు అందిస్తున్న కేంద్రం తాజాగా భారత్‌ బియ్యం పేరుతో భారీ సబ్సిడీతో బియ్యం అందించాలని భావిస్తోంది. ఈ విషయాన్ని ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక రాసింది. ఈ పత్రిక సమాచారం మేరకు కిలోకు రూ. 25లకే బియ్యం అందించాలని కేంద్రం భావిస్తోంది. నేషనల్‌ కో ఆపరేటివ్‌ కన్జ్యూమర్‌ ఫెడరేషన్‌ (ఎన్‌సీసీఎఫ్‌), నేషనల్‌ అగ్రికల్చర్‌ కో ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (నాఫెడ్‌)తో పాటు కేంద్రీయ భండార్‌లలో ఈ సబ్సిడీ బియ్యం అందించనున్నారు. ప్రస్తుతం భారత్‌ దాల్‌ పేరుతో రూ.60కే కిలో శనగపప్పు, రూ.27.50కే కిలో గోధుమ పిండిని భారత్‌ ఆటా పేరుతో కేంద్రం అందిస్తోంది.