For Money

Business News

వడ్డీ రేట్లను పెంచిన ఇంగ్లండ్‌

ఫెడ్‌ నిర్ణయం తరవాత అనేక దేశాలు తమ దేశంలో వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. కరోనా సమయంలో వేలం వెర్రిగా నోట్లను ప్రింట్‌ చేయడంతో గత కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఇంగ్లండ్‌లో ద్రవ్యోల్బణం 7 శాతానికి చేరింది. గడచిన 30 ఏళ్ళలో ఇదే అత్యధికం. దీంతో బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ ఇవాళ రీఫైనాన్సింగ్‌ వడ్డీ రేటును 0.25 శాతం పెంచింది. దీంతో ఈ రేటు ఒక శాతానికి పెరిగింది. అయితే వడ్డీ రేట్లను పెంచకుండా ధరలను అదుపు చేయాలని ఆర్థిక వేత్తలు అంటున్నారు. ఇటీవల కాలంలో ఇంగ్లండ్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగదల కారణంగా ఇంధన బిల్లు 40 శాతం పెరిగింది. ఇప్పటికే కష్టాల్లో ఉన్న ప్రజలకు రుణం కూడా అందుబాటులో లేకుంటే దేశం మాంద్యంలోకి వెళుతుందని వారు హెచ్చరిస్తున్నారు.