For Money

Business News

తమిళనాడులో కొత్త కరోనా వైరస్‌

ఒమైక్రాన్‌ నుంచి ఇపుడిపుడే బయటపడుతున్న సమయంలో తమిళనాడులో కొరోనా కొత్త వైరస్‌ BA.2 బయటపడింది. ఒమైక్రాన్‌కు ఇది సబ్‌ వేరియంట్‌ అని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య జరిపిన పరీక్షల్లో 18.4 శాతం మందికి ఈ కొత్త వేరియంట్‌ సోకినట్లు తమిళనాడు ప్రజా ఆరోగ్య విభాగం వెల్లడించింది. శాంపిల్స్‌లో BA.1.1 వేరియంట్‌ 43 శాతం, BA.1 వేరియంట్‌ 37.3 శాతం పరీక్షల్లో తేలినట్లు పేర్కొంది. ప్రస్తుతం బ్రిటన్‌ను ఈ BA.2 వేరియంట్‌ కుదిపేస్తోంది. రాష్ట్రంలో కరోనా శాంపిల్స్‌లో 93 శాతం ఒమైక్రాన్‌ వేరియంట్‌ కేసులేనని తమిళనాడు ప్రజా ఆరోగ్య విభాగం పేర్కొంది. 6.6 శాతం డెల్టా వేరియంట్‌ అని తెలిపింది. ప్రజలను అప్రమత్తం చేసేందుకే పూర్తి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ (Whole Genome Sequencing -WGS) డేటాను బయట పెడుతున్నామని.. BA.2 వేరియంట్‌ ఇప్పటికే రాష్ట్రంలో ఉందని చెప్పడానికే ఈ వివరాలు వెల్లడిస్తున్నట్లు తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి జే రాధాకృష్ణన్‌ తెలిపారు.