For Money

Business News

15న మరో రూ. 2,000 కోట్ల అప్పు…RBI

ఆర్థిక సంవత్సరం మరో 20 రోజుల్లో ముగుస్తుందనగా ఏపీ మరోసారి మార్కెట్‌ నుంచి మరో రూ.2000 కోట్లు తీసుకోనుంది. ఈనెల 15వ తేదీన ఏపీ తరఫున రూ.1000 కోట్లు చెప్పున రెండు రుణాలు విక్రయిస్తున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. ఒక రుణం 18 ఏళ్ళ వ్యవధితో ఆఫర్‌ చేస్తుండగా, మరో రుణం 18 ఏళ్ళ వ్యవధికి ఆఫర్‌ చేస్తున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. మరి ఈ రుణాలు తాజా ఖర్చులకా… లేదా రుణాల తిరిగి చెల్లింపు వాడుతారా అన్నది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇవాళ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో 2021-22 రుణ అంచనా రూ.52,582 కోట్లు కాగా, పూర్తి ఏడాదికి రుణ మొత్తం రూ. 55,723 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. అయితే కాగ్‌ నివేదిక ప్రకారం జనవరి నెలాఖరుకే రాష్ట్ర ప్రభుత్వం రూ.58,703 కోట్ల రుణం తెచ్చేసుకుంది. మరి తాజాగా తెచ్చే రుణం తిరిగి చెల్లింపులకైతే సరి… లేదంటే పూర్తి ఏడాదికి రుణ మొత్తం రూ. 60,000 కోట్లు దాటుతుంది. దీన్ని వచ్చే బడ్జెట్‌లో వాస్తవ లెక్కల కింద చూపుతారన్నమాట.