For Money

Business News

పేదల నెత్తిన కరెంటు పిడుగు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) చైర్మన్‌ జస్టిస్‌ సీవీ నాగార్జున రెడ్డి తిరుపతిలో ఇవాళ విడుదల చేసి విద్యుత్‌ చార్జీలను పరిశీలిస్తే.. పేదల నెత్తిన అధిక భారం వేసినట్లుంది. ధనికులకు నామ మాత్రం చార్జీలు పెంచి… పేదలు, మధ్య తరగతి వినియోగదారుల నెత్తిన ఏకంగా 45 శాతం వరకు చార్జీలను పెంచారు. మరీ ముఖ్యంగా కరెంటును అత్యధికంగా వినియోగించే వర్గాలపై వడ్డన చాలా అధికమనే చెప్పాలి. వేసవికాలంలో కూలర్లు, ఏసీలు వాడటం సర్వసాధారణం. దీంతో వెంటనే కేటగిరీలు మారిపోతాయి. దీంతో చార్జీల భారం మరీ ఎక్కువ పడే అవకాశముంది. వివిధ కేటగిరీలకు చార్జీలు ఏ శాతం పెంచారో దిగవ చూడండి…