For Money

Business News

అమూల్‌ పాల ధర పెంపు

ఇవాళ ఉదయం అమూల్‌ కంపెనీ మహా శివరాత్రి శుభకాంక్షలంటూ తన కస్టమర్లకు శుభాకాంక్షలు తెలిపింది. మధ్యాహ్నం అయ్యేసరికల్లా ఓ పత్రికా ప్రకటన జారీ చేసింది. రేపటి నుంచి అంటే మార్చి 1వ తేదీ నుంచి లీటర్‌ పాలు ధర రూ.2 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. తాము ధరలు నాలుగు శాతం మాత్రమే పెంచామని, వాస్తవానికి ఇది ద్రవ్యోల్బణం కంటే తక్కువేనని కంపెనీ పేర్కొంది. తాజా పెంఉతో అమూల్‌ గోల్డ్‌ మిల్క్‌ అర లీటరు ధర రూ. 30, అమూల్‌ తాజా ధర రూ. 24లని కంపెనీ పేర్కొంది. అమూల్‌ శక్తి పాలధర అర లీటరు రూ.27లని కంపెనీ తెలిపింది.ఈ పెంపుతో ప్రధాన మెట్రో నగరాల్లో ఫుల్‌ క్రీమ్‌ లీటర్‌ పాలు ధర రూ. 60లకు చేరింది. టోన్డ్‌ మిల్స్‌ ధర అహ్మదాబాద్‌ రూ.48, ఢిల్లీలో రూ.50లకు అమ్ముతున్నట్లు అమూల్‌ పేర్కొంది. గత ఏడాది జులైలో కంపెనీ పాల ధరను పెంచింది. అంటే ఏడాది కూడా పూర్తి కాకుండానే మరోసారి పెంచింది. పాల కోసం వినియోగదారుడు చెల్లించే ప్రతి రూపాయిలో 80 పైసలు పాడిరైతుకు అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.