For Money

Business News

వొడాఫోన్‌లో అమెజాన్ పెట్టుబడులు?

వొడాఫోన్ ఐడియాలో ఈ-కామర్స్ దిగ్గజం దిగ్గజం అమెజాన్‌ భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోందని వార్తలు వస్తున్నాయి. ఏకంగా రూ. 20వేల కోట్ల పెట్టుబడిని అమెజాన్‌ పెట్టవచ్చని ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక రాసింది. ఈ వార్తతో వొడాఫోన్‌​ ఐడియా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. కంపనీ షేర్‌ ఇంట్రా డేలో రూ.9.36కి చేరింది. ఇప్పటి వరకు వోడాఫోన్‌లో విదేశీ పెట్టుబడి సంస్థలు పెట్టుబడులు పెట్టలేదు. ఫేస్‌బుక్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ ఇండియాలో తమ క్లౌడ్ సేవల్ని మరింత బలోపేతం చేసేందుకు దేశీయ టాప్ టెలికాం ఆపరేటర్లు జియో, ఎయిర్‌టెల్‌లో భారీ పెట్టుబడి పెట్టాయి. కాని వోడాఫోన్‌ వైపు ఏ సంస్థ కూడా కన్నెత్తి చూడలేదు. ఫండ్ రైజింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని నెట్‌వర్క్‌లో పెట్టుబడికి ఉపయోగించాలని వొడాఫోన్‌ యోచిస్తోంది.