For Money

Business News

అదానీ చేతికి ఎన్డీటీవీ

అదానీ గ్రూప్‌నకు చెందిన ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్‌ లిమిటెడ్‌ ఎన్డీటీవీలో పరోక్షంగా 29.18 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఎన్డీటీవీలో ప్రణయ్‌ రాయ్‌కు 29.18 శాతం వాటా ఉంది. ఈ మొత్తం వాటాను ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్‌ లిమిటెడ్‌కు అనుబంధ కంపెనీ అయిన విశ్వప్రధాన్‌ కమర్షియల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కొనుగోలు చేసింది. కంపెనీలో 26 శాతం మించి వాటాను కొనుగోలు చేయడంతో ఇతర వాటాదారులకు అదానీ గ్రూప్‌ ఓపెన్ ఆఫర్‌ చేయనుంది. మరో 26 శాతం వరకు వాటా కొనేందుకు అదానీ గ్రూప్‌ ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించాల్సి ఉంటుంది. డిజిటల్‌ ఛానల్స్‌తో పాటు మూడు ప్రధాన ఛానల్స్‌ (ఎన్‌డీటీవీ ఇండియా,ఎన్డీటీవీ 24X7, ఎన్‌డీటీవీ ప్రాఫిట్‌) ఎన్డీటీవీ చేతిలో ఉన్నాయి. 2021-22లో కంపెనీ రూ. 421 కోట్ల టర్నోవర్‌ రూ.85 కోట్ల నికర లాభం ఆర్జించింది.