For Money

Business News

లాభాల్లో ముగిసిన నిఫ్టి

ఉదయం భారీ నష్టాలతో ఆరంభమైన నిఫ్టి వెంటనే కోలుకుంది. మిడ్‌ సెషన్‌లోగా లాభనష్టాల్లో కదలాడినా … ఆ తరవాత పటిష్ఠంగా గ్రీన్‌లో కొనసాగింది. మిడ్‌ సెషన్‌ సమయంలో యూరో మార్కెట్లు బలహీనంగా ప్రారంభమయ్యాయి. అమెరికా ఫ్యూచర్స్‌ కూడా డల్‌గా ఉన్నా నిఫ్టి ఆకర్షణీయ లాభాలతో ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 87 పాయింట్ల లాభంతో 17,577 పాయింట్ల వద్ద ముగిసింది. ఎం అండ్‌ ఎం ఇవాళ నాలుగు శాతం పైగా లాభపడింది. అలాగే ఐషర్‌ మోటార్స్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వీస్‌ కూడా. అయితే ఇవాళ ఐటీ షేర్లు భారీ నష్టాలతో ముగిశాయి. దివీస్‌ల్యాబ్‌ కూడా రూ.3533 వద్ద ముగిసింది. అదానీ గ్రూప్‌పై ఫిచ్‌ రేటింగ్‌ చేసిన వ్యాఖ్యలు అదానీ గ్రీన్‌ షేర్‌ను దెబ్బతీశాయి. అలాగే అదానీ విల్మర్‌ కూడా భారీగానే క్షీణించింది. బ్యాంక్‌ షేర్లలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా భారీగా పెరిగింది. ఈకౌంటర్‌లో డెలివరీ వ్యాల్యూమ్‌ భారీగా పెరుగుతోంది. ఇక మిడ్‌ క్యాప్‌ ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ ఆరు శాతం దాకా పెరిగింది. ఉదయం నష్టాల్లో ఉన్న బ్యాంక్‌ నిఫ్టి ఒక శాతంపైగా లాభంతో క్లోజైంది. లోకల్‌ షేర్లలో రెయిన్‌ బో హాస్పిటల్‌, అపోలో హాస్పిటల్‌ లాభాల్లో ముగిశాయి.