ఏపీలో భారీ సిమెంట్ ప్లాంట్
ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ సిమెంట్ ప్లాంట్ రానుంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు వద్ద రూ. 1,500 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ సిమెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు శ్రీ సిమెంట్ కంపెనీ ఎండీ హెచ్ఎం.బంగూర్, జేఎండీ ప్రశాంత్ బంగూర్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టును 24 నెలల్లో పూర్తిచేసేలా ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. దేశంలోని అతి పెద్ద సిమెంట్ కంపెనీల్లో శ్రీసిమెంట్ ఒకటి. ఇప్పటికే 9 రాష్ట్రాలలో సిమెంట్ తయారీ, అనుబంధ రంగాలకు సంబంధించిన ప్లాంట్స్ ఈ కంపెనీకి ఉన్నాయి. ఇవాళ కంపెనీ ప్రమోటర్లు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిన కలిశారు. ప్రోత్సాహకాలపై శ్రీ సిమెంట్ మేనేజ్మెంట్ టీమ్‌తో సీఎం జగన్ చర్చించారు.