For Money

Business News

యాక్సిస్‌ బ్యాంక్‌ చేతికి సిటీ బ్యాంక్‌ వ్యాపారం

భారత దేశంలో రీటైల్‌ వ్యాపారం నుంచి సిటీ బ్యాంక్‌ వైదొలగిన విషయం తెలిసిందే. ఇపుడు బ్యాంకుకు ఉన్న వ్యాపారం కోసం పలు బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. ఈ రేసులో యాక్సిస్‌ బ్యాంక్‌ ముందు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం వ్యాపారాన్ని క్యాష్‌ డీల్‌ కింద కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ విలువ 200 కోట్ల డాలర్లు ఉంటుందని భావిస్తున్నారు. సిటీ బ్యాంక్‌ రీటైల్‌ వ్యాపారం కోసం కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్ కూడా ప్రయత్నించాయి.