For Money

Business News

ఏపీలో 134 ఎకరాలు కొనుగోలు

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో 134 ఎకరాల భూమి కొనుగోలుకు న్యూల్యాండ్‌ లాబొరేటరీస్‌ (Neuland Laboratories Ltd) రూ.126 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో ఉన్న ‘ఆరో ఇండస్ట్రియల్ సిటీ’ (Auro Industrial City)లో సుమారు 134 ఎకరాల భూమిని కొనేందుకు కంపెనీ సోమవారం ఆమోదం తెలిపింది. దీని కోసం అవసరమైన మొత్తాన్ని అంతర్గతంగానే కంపెనీ సమకూర్చుకోనుంది. భవిష్యత్తులో కంపెనీ కార్యకలాపాల విస్తరణ కోసం ఈ భూమిని ఉపయోగించనుంది. మున్ముందు అదే ప్రాంతానికి ఆనుకుని ఉన్న మరో 66 ఎకరాల భూమిని కొనుగోలు చేసేందుకు Neuland Laboratoriesకు ‘రైట్ ఆఫ్ ఫస్ట్ రిఫ్యూజల్’ ఉంది. అంటే ఆ భూమిని అమ్మదలిస్తే తొలి ప్రాధాన్యం కంపెనీకి ఇవ్వాల్సి ఉంటుంది. కంపెనీ వొద్దంటేనే ఇతరులకు అమ్మాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ భూమిని కూడా కొనుగోలు చేస్తే, అక్కడ కంపెనీకి మొత్తం భూమి విస్తీర్ణం సుమారు 200 ఎకరాలకు పెరుగుతుంది. జూన్ 30, 2026తో ముగిసిన త్రైమాసికానికి రూ. 148 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం. రూ. 14 కోట్లు మాత్రమే. అలాఏ కంపెనీ ఆదాయం కూడా వంద శాతం పెరిగి రూ. రూ. 292.7 కోట్ల నుంచి రూ. 641.5 కోట్లకు చేరింది.

Leave a Reply