మరో వంద పాయింట్లు మటాష్
ప్రపంచ మార్కెట్లలో ముఖ్యంగా ఆసియా మార్కెట్లకు చాలా భిన్నంగా మన మార్కెట్లు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఏఐ రంగంలో మనం లేకపోవడం, చిప్ తయారీలో ఊసే లేకపోవడంతో… ఆసియా మార్కెట్లు దూసుకుపోతున్నా… మన మార్కెట్లు రోజుకో వంద పాయింట్లు చొప్పున పడుతోంది. స్థానికంగా రాణిస్తున్న కొన్ని కంపెనీలు వినా… ఇతర షేర్ల జోలికి పోవడం లేదు. తాజాగా బ్రెంట్ క్రూడ్ వంద డాలర్లకు చేరడం, కాగ్నిజెంట్‌పై అమెరికా చర్యలు మన మార్కెట్లు చాలా మైనస్లుగా మారాయి. కాగ్నిజెంట్ పై చర్యలతో ఇతర కంపెనీల షేర్లు కూడా దెబ్బతింటున్నాయి. ఇన్ఫోసిస్, విప్రో ఏడిఆర్‌లు రాత్రి అయిదు శాతం దాకా పడ్డాయి. ఇక క్రూడ్ సంగతి సరే. ఇప్పటికే మన క్రూడ్ బాస్కెట్ ధర 100 డాలర్లు దాటింది. ఇక ఏమాత్రం పెరిగిన మన ఆయిల్ కంపెనీలకు పెద్ద భారమే. వరుసగా డజన్ల కొద్దీ కంపెనీలు ప్రైమరీకి వస్తుండటంతో సెకండరీలో లిక్విడిటీ తగ్గుతోంది. ఎన్ఎస్ఈ కూడా తన ఇష్యూ సైజ్‌ను రూ. 30,000 కోట్ల నుంచి రూ. 25,000 కోట్లకు తగ్గించనుంది. ఈ కోణంలో చూసినా మార్కెట్‌కు పాజిటివ్ ట్రిగ్గర్స్ లేవు. గోల్డ్ ధరలు తగ్గడంతో గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలు రాణించడం లేదు. ఆయిల్ కారణగా NBFC షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఇవాళ నిఫ్టి అత్యంత కీలక స్థాయి 23600ను పోగొట్టుకోనుంది. మరి 23500 స్థాయి నిలబడుతుందా అన్న అనుమానం ఉంది. ఎందుకంటే రేపు మళ్ళీ బీఎస్ఈ సన్సెక్స్ వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ ఉంది. విదేశీ ఇన్వెస్టర్లు గత అయిు సెషన్స్‌లో భారీగా అమ్మారు. కాబట్టి నిఫ్టి పెరిగే ఛాన్స్ ఈ వీక్లీ సిరీస్‌లో కష్టంగా ఉంది.
